పిల్లలకు చలికాలంలో స్వెటర్ వేసుకోవటం అలవాటు చేయటం మంచిది. పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు, ఖనిజాలున్న ఆహారం ఇవ్వాలి. ‘ సి ’విటమిన్ ఉన్న పోషకాహారాలు ఎక్కువగా తీసుకుంటే జ్వరం, జలుబు బారినపడకుండా వుంటారు పిల్లలు.
పిల్లలు ఎక్సర్ సైజ్ చేయటం వలన కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాయామం, వలన పిల్లల శరీరకృతి వృద్ది చెందుతుంది. చక్కటి ఆహారం తీసుకోవటం, సరైన వేళకు నిద్రపోవటం కూడా పిల్లల ఆరోగ్యానికి మంచిది.
ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ కూర్చునే పిల్లల్లో రోగ నిరోధక శక్తి నశిస్తుంది. పిల్లల్ని ఒంటరిగా, దిగాలుగా వుండకుండా చూడాల్సిన బాధ్యత పెద్దలది. వాళ్ళకి హుషారు కలిగించేలా రకరకాల ఆటలు అనేకం వున్నాయి.
కారమ్స్, ఫుట్ బాల్, అంత్యాక్షరి, క్రికెట్ మీదే తమ దృష్టిని కేంద్రీకరించే పిల్లలను ఉత్సహపరచటం చాలా మంచిది.
మరింత సమాచారం తెలుసుకోండి: